మోడికి జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల అభ్యర్థన

Jet Airways
Jet Airways

ముంబయి: అప్పుల ఉబిలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకోవాలని ఆ సంస్థ పైలట్ల సంఘం ‘ఏవియేటర్స్‌ గిల్డ్‌’ ఎస్‌బీఐను కోరింది. అంతేకాక సంస్థలోని 20,000 ఉద్యోగాలను కాపాడాలని ప్రధాని మోడి ని కూడా అభ్యర్థిస్తున్నాం అని నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) వైస్‌ ఛైర్మన్‌ అదిమ్‌ వలియానీ ఈరోజు తెలిపారు. ముందుగా ప్రతిపాదించినట్లు రుణ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వెంటనే రూ.1500కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు.ఖఖ సంస్థ కార్యకలాపాలు కొనసాగాలంటే తక్షణమే రూ.1500 కోట్లు విడుదల చేయాలని ఎస్‌బీఐని కోరుతున్నాం. అని అన్నారు. దీనికి సంస్థలోని ఇతర ఉద్యోగులూ సంఘీభావం తెలిపారు.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/