దివాలాకిందకు వస్తే 10% మాత్రమే రికవరీ


జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి బ్యాంకర్లకు అందే మొత్తం

jet airways
jet airways


న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ కిందకు వస్తే రుణదాతలు అంటే బ్యాంకర్లు ఏకమొత్తంగా 300 నుంచి 400 మిలియన్‌ డాలర్లు మాత్రమే సొందగలుగుతారన్న అంచనాలున్నాయి. దివాలా ప్రక్రియకిందకు వస్తే జెట్‌ఎయిర్‌వేస్‌ నుంచి బ్యాంకర్లకు ఈ మొత్తాలు మాత్రమే అందుటాయి. ఎయిర్‌లన్స్‌ ఆర్ధిక, నిర్వహణ రుణదాతలకు సుమారు 30వేల కోట్లు అంటే 4.20 బిలియన్‌ డాలర్లు రికవరీచేయాల్సి ఉంటుంది. మొత్తం బకాయిల్లో పదిశాతంమాత్రమే జెట్‌ స్థిరాస్తులనుంచి సమకూరుతుందని అంచనా. జెట్‌ ఎయిర్‌లైన్స్‌ జూన్‌ నెలలోనే దివాలాప్రక్రియ కిందకు వచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసింది. ఎస్‌బిఐ జెట్‌ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ ప్రణాళికకు విముఖత చూపించడంతో జెట్‌ఎయిర్‌వేస్‌కు ఇక దివాలాకిందకు రావడం ఒక్కటేమిగిలింది.

ఈ దివాలా ప్రక్రియ కిందకు వస్తే కేవలం మొత్తం బకాయిల్లో కేవలం 10శాతం మాత్రమే బ్యాంకర్లకు అందుతాయన్న అంచనాలు సైతం ఉన్నాయి. 30వేల కోట్లలో సుమారు 300 నుంచి 400 మిలియన్‌ డాలర్లు మాత్రమే జెట్‌ ఆస్తులు అమ్మకం ద్వారా వస్తుంది. సొంత విమానాలు, రియల్‌ఎస్టేట్‌ విలువలు మొత్తంగా 300 నుంచి 400 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. వాస్తవానికి జెట్‌ ఎయిర్‌వేస్‌కు 120 విమానాలవరకూ సర్వీసరూట్లలో నడుస్తున్నాయి. దేశీయంగా కూడా 12కుపైగా వివిధరూట్లునడుపుతోంది. అంతర్జాతీయ హబ్‌లైన సింగపూర్‌, లండన్‌, దుబాయి కేంద్రాలకు సైతం జెట్‌ ఎయిర్‌వేస్‌ రూట్లు ఉన్నాయి. భారత్‌లోనే అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచిన జెట్‌ఎయిర్‌వేస్‌ ఏప్రిల్‌నుంచి రాకపోకాలను నిలిపివేసింది. నగదు కొరతకారణంగా సంక్షోభం తలెత్తి వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఎస్‌బిఐ పునరుద్ధరణకు అంగీకరించకపోవడంతో ఇక దివాలాకిందకు వచ్చింది. కోర్టు నియమించిన వృత్తినిపుణులు ఇపుడు మొత్తం కంపెనీకి బాధ్యునిగా వ్యవహరిస్తారు. అయితేఈ వ్యవహారాలపై ఆయన వ్యాఖ్యానించేందుకు ముందుకురాలేదు. ఇపుడు కేవలం మిగిలి ఉన్న దివాలాప్రక్రియ ఒక్కటే మార్గమని ప్రస్తుతం బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/