నరేశ్ గోయల్‌కు చుక్కెదురు

 Naresh Goyal
Naresh Goyal

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌ వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు ఢిల్లీ న్యాయస్థానంలోచుక్కెదురైంది.. ఆయన దేశం విడిచివెళ్లడానికి ఈరోజు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. అలాగే తన మీద జారీ చేసిన లుక్‌ అవుట్ సర్క్యులర్‌(ఎల్‌ఓసీ)ను సవాలు చేస్తూ గోయల్ చేసిన అభ్యర్థనపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే గోయల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సురేశ్ కెయిత్ తీర్పునిస్తూ..ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని, ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే రూ.18,000 కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని కోరారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/