జెట్‌ షేర్లు భారీగా పతనం

jet airways
jet airways

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ మొదలైనప్పటి నుంచి 29 శాతం కుంగాయి. నేడు ఈ కంపెనీ భవిష్యత్‌పై ఎన్‌సీఎల్‌టిలో విచారణ ఉండడంతో మదుపరులు భారీగా ఈ కంపెనీ షేర్లను విక్రయించేస్తున్నారు. ఎస్‌బిఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ మంగళవారం ముంబై ఎన్‌సిఎల్‌టిలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆశీష్‌ ఛవ్చరియాను ఇంటీరియం రిసొల్యూషన్‌ ప్రొషెషనల్‌గా ఎంపిక చేశారు. దీంతో ఆయన కంపెనీకి చెందిన యాజమాన్య హక్కులు, విమానాల లీజుల వివరాలు, ఉద్యోగుల సమాచారం, ఆస్తులు, అప్పుల విలువను లెక్కగట్టాల్సిఉంది. గత వారంలో కంపెనీ షేర్లు 74 శాతం కుంగాయి.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/