జెట్‌ ఎయిర్‌వేస్‌ డౌన్‌ ఎస్‌ఆర్‌ఎఫ్‌ అప్‌

jet airways
jet airways

న్యూఢిల్లీ,: లీజు చెల్లింపుల్లో విఫలంకావడంతో తాజాగా మరో 15 ఎయిర్‌క్రాఫ్ట్‌ల సర్వీసులు నిలిచిపోయినట్లు జెట్‌ఎయిర్‌వేస్‌ తెలియచేసింది. దీంతో ఇప్పటివరకూ 69 విమానాలు నిలిచిపోయినట్లు తెలియచేసింది. మరోవైపు సిబ్బందికి వేతన చెల్లింపులను వాయిదా వేయడంతో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలకు సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3.2శాతం క్షీణించి రూ.244వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.241వరకూ నీరసించింది. అదేవిధంగా ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కూడా గుజరాత్‌లోని దహేజ్‌లో గల పారిశ్రామిక ప్లాంట్‌ను మూసివేయవలసిందిగా ఇటీవల జారీచేసిన ఆదేశాలను కాలుష్య నివారన బోర్డు రద్దుచేసినట్లు ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. నీటి వినియోగానికి సంబంధించి నిబంధనలు పాటించని కారణంగా గతంలో ఆదేశాలు జారీ కాగా, యూనిట్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 2.75శాతం పుంజుకొని రూ.2450వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.2458వరకూ దూసుకెళ్లింది.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/business/