అవన్నీ తప్పుడు వార్తలేనని ఐటీ శాఖ స్పష్టీకరణ

Income Tax Department
Income Tax Department

న్యూఢిల్లీ: ఆదాయపు రిటర్నులు దాఖలుకు గడువు పెంచుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఐటీ శాఖ ఖండించింది. అవన్నీ కూడా తప్పుడు వార్తలేనని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటి వరకే ఉందని స్పష్టం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని.. రిటర్నులు దాఖలు చేసేందుకు మరో నెల రోజులు (సెప్టెంబర్‌ 30) వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/