ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ లాభం రూ.4,037 కోట్లు

రూ.8 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన కంపెనీ

infosys
infosys

బెంగళూరు: దేశంలో రెండవ అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.4,037 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,110 కోట్లతో పోలిస్తే ఇప్పుడు నికర లాభం 1.7 శాతం మేర తగ్గినప్పటికీ గత త్రైమాసికంతో పోలిస్తే పెరగడం గమనార్హం. అంతేకాదు కంపెనీ లాభాలు మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టి వెళ్లడాన్ని తగ్గించడం కోసం ఉద్యోగులపై చేసేఖర్చు పెరగడమే నికర లాభాలు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల ప్రయోజనాల కోసం కంపెనీ చేసే ఖర్చు 13.6 శాతం మేర పెరిగింది. కంపెనీ తీసుకున్న చర్యల కారణంగా ఒకప్పుడు 23.4 శాతం మేర ఉండిన ఉద్యోగులు కంపెనీని వదిలిపెట్టి వెళ్లడం ఇప్పుడు 21.7 శాతానికి తగ్గింది. కాగా కంపెనీ ఈ ఆర్థిక పంవత్సరానికి రెవిన్యూ రాబడి అంచనాను సైతం గతంలో అంచనా వేసిన 8.510 శాతంనుంచి 910 శాతానికి పెంచింది. కంపెనీ రాబడిలో కీలకమైన డిజిటల్ వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 38.4 శాతం పెరగడంతో కంపెనీకి దీని ద్వారా వచ్చే రాబడి సైతం రూ. 1.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరో వైపు కంపెనీ ప్రధాన వ్యాపారం 0.7 శాతం తగ్గడంతో దీనిద్వారా వచ్చే రాబడి 1.98 బిలియన్ డాలర్లుగా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/