ఇండిగో మరిన్ని విమానాలు కొనుగోలు

IndiGo
IndiGo

ఇస్తాంబుల్‌: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇప్పుడు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేయనుంది. తాజాగా 20 నుంచి 25 ఎయిర్‌బస్‌ ఎ321  విమానాలను కొనుగోలు చేయనుంది. త్వరలో అంతర్జాతీయ విమానసర్వీసులను ఈ సంస్థ విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో 48 విమానాలను తీసుకోనుంది. వీటిల్లో 25  ఎ 321 మోడళ్లను తీసుకోగా.. మిగిలినవి ఎ320 మోడల్‌ను తీసుకోనుంది.  ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విల్లీ బౌల్టర్‌ బుధవారం ఇస్తాంబుల్‌లోని ఇండిగో మెయిడెన్‌ ఫ్లైట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ   ‘‘ప్రస్తుతుం రోజుకో సర్వీసును నడుపుతున్నాం. ఈ నెల తర్వాత నుంచి రెండో సర్వీసును కూడా ఏర్పాటు చేస్తాము.మధ్యశ్రేణి దూరాలకు సర్వీసులను పెంచుతాము. చైనా, వియత్నాం, సౌదీ మార్గాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పటికే గాట్విక్‌లో స్లాట్‌ వచ్చినా వాటిని వినియోగించుకోలేకపోయాము’’ అని పేర్కొన్నారు.  ఇప్పటికే ఇండిగోకు టర్కిస్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం ఉంది.