ఇండిగోలో విభేదాలతో కంపెనీ షేర్లు పతనం

INDIGO
INDIGO

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేశ్‌ గంగ్వాల్‌ మధ్య విభేదాలు బయటకు పొక్కడం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇండిగో షేర్లు కుప్పకూలాయి. మార్కెట్‌ ఆరంభంలోనే భారీ నష్టంతో మొదలైన షేరు ధర పడిపోయి రూ. 1264.85కి పడిపోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే కొనసాగుతుంది.
ఇండిగోలో తీవ్రమైన పాలనా లోపాలున్నాయని, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జోక్యం చేసుకోవాలని కోరుతూ రాకేశ్‌ గంగ్వాల్‌ లేఖ రాయడంతో ఈ విభేదాలు తెరపైకి వచ్చాయి. పాలనలో ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండడంతో సంస్థ ఉన్నత స్థాయికి చేరింది. ఐతే ఇప్పుడు ఆ ప్రధాన సూత్రాలు, విలువలు పక్కదారి పడుతున్నాయని గంగ్వాల్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గంగ్వాల్‌ ఆరోపణలపై ఈ నెల 19లోగా కంపెనీ వివరణ ఇవ్వాలని సెబీ సూచించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/