ఇండిగో ఫలితాలు భేష్‌

IndiGo
IndiGo

న్యూఢిల్లీ : ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇండిగో లాభాల్లో ఏకంగా 42 రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,203 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ1లో రూ.27 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. విమాన ఇంధన ధరలు తగ్గడం, టికెట్‌ అమ్మకాలు పెరగడం, దేశీయ కరెన్సీ విలువ కూడా పటిష్టంగా ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఇండిగో సిఇఒ రొనోజారు దుత్తా పేర్కొన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/