ఇండిగో సమర్‌ ఆఫర్‌ రూ.999

IndiGo
IndiGo

న్యూఢిల్లీ: వేసవికాలం సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 16 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ను 53 దేశీయ, 17 అంతర్జాతీయ రూట్లలో నడిచే సర్వీసులకు వర్తింపచేసింది. అన్ని పన్నులు కలుపుకొని ప్రారంభ విమాన టిక్కెట్ ధరను రూ.999గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 28 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో ఢిల్లీఅహ్మదాబాద్, ముంబైహైదరాబాద్, హైదరాబాద్దుబాయి, చెన్నైకువైట్, ఢిల్లీకౌలాలంపూర్, బెంగళూరుమాలే మధ్య నడిచే సర్వీసులతోపాటు ఇతర సర్వీసులకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నదని ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి తెలిపారు. హాలీడే సీజన్‌లో అధిక బరువును తీసుకువెళ్లే వారికి 30 శాతం రాయితీని కూడా సంస్థ ఇస్తున్నది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/