5ఏళ్లలో రూ.5లక్షలు కావాలంటే ఇలా ఇన్వెస్ట్‌ చేయండి

న్యూఢిల్లీ :పోస్టాఫీసు పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వీటి అవసరం ఎక్కువ. పేద, మధ్యతరగతి వర్గాలు తమ డబ్బును పొదుపు చేయడానికి పోస్టాఫీసు పథకాలను ఎంచుకుంటారు. అందుకే భారతదేశంలో పోస్టాఫీసు సేవింగ్స్‌ స్కీమ్స్‌కు మంచి పేరు ఉంది. సార్వభౌమ హామీ ఉండటం, వడ్డీరేట్లు ఆకరణీయంగా ఉండటమే ప్రధానకారణం. దానికి తోడు గ్రామగ్రామాల్లో పోస్టాఫీసులు ఉంటాయి. దీంతో పోస్టాఫీసు పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పోస్టాఫీసులో పొదుపు పథకాలతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా ఉన్నాయి. 5 ఏళ్ల రికరింగ్‌ డిపాజిట్‌, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌, 5ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, 5 ఏళ్ల నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫీకెట్స్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, పబ్లిక్‌ ప్రావిడింట్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలు కూడా ఉన్నాయి. వీటి కాల వ్యవధి ఒక ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్లు. మరి 5 ఏళ్లలో రూ.5 లోలు కావాలంటే ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలో తెలుసుకోండి. ఐదేళ్ల పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్‌ చేయొచ్చు. ఇద్దరు కలిసి జాయింట్‌గా అకౌంట్‌ తెరవచ్చు. మైనర్‌ పేరు మీద కూడా ఈ అకౌంట్‌ తీసుకోవచ్చు. 10 ఏళ్ల వయస్సు కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు సొంతంగా ఈ అకౌంట్‌ ఆపరేట్‌ చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత అకౌంట్‌ను కన్వర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి రూ.200చెల్లించాలి. రూ.200చొప్పున ఎంతైనా జమ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా జమచేయొచ్చు. వడ్డీని మూడు నెలలకోసారి లెక్కించి వార్షికంగా చెల్లిస్తారు. ఉదాహరణకు వడ్డీరేటు 7.8శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5 లక్షలు జమ కావడానికి మీరు కనీసం రూ.3.4లోలు జమచేయాలి. ఎక్కువ మొత్తం ఒకేసారి డిపాజిట్‌ చేయలేనివాళ్లు రికరింగ్‌ డిపాజిట్‌ తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి రూ.10చాలు. ఇందులో మీరు ఎంతైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. వార్షిక వడ్డీరేటు 7.3శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5లక్షలు జమ కావడానికి నెలకు రూ.6,900చెల్లించాలి. 60ఏళ్లు దాటిన వృద్ధుల కోసం ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. గరిష్టంగా రూ.15లక్షల వరకు ఇన్వెస్‌ట చేయొచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.8శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలోరూ.5లక్షలు జమకావడానికి రూ.3.26లక్షలు జమచేయాలి.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/business/