ఐఒసి నికరలాభం 6099 కోట్లు

 Indian Oil Corporation
Indian Oil Corporation

ముంబయి: ప్రభుత్వ రంగంలోని ఇండిన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నాలుగో త్రైమాసికం లో నికరలాభం 17శాతం పెరిగింది. విదేశీకరెన్సీ హెచ్చుతగ్గులుసైతం కొంత లాభాలు తెచ్చిపెట్టా యని అంచనా. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం లో నికరలాభం 6099.27 కోట్లుగా ఉంటే గత ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో 5218.10 కోట్ల నుంచి 17శాతం పెరిగిందని తేలింది. మార్కె టింగ్‌, కరెన్సీ మార్పిడి లాభా లు కొంత నికర లాభాన్ని పెంచాయని ఐఒసి ఛైర్మన్‌ సంజీవ్‌సింగ్‌ వెల్లడించారు. కంపెనీ స్థూల శుద్ధి మార్జిన్‌ బ్యారెల్‌కు 4.09 డాలర్లుగా నిలి చింది. గత ఏడాది 9.12 డాలర్ల నుంచి కొంత మేర తగ్గింది. కంపెనీ కి విదేశీ కరెన్సి మార్పిడి ద్వారా వచ్చిన లాభం 837 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 676 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక కార్యకలాపాల రాబడులు రూ.1,44,472 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదేకాలంలో 1,36,716 కోట్లుగా ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో ఐఒసి ఉత్పత్తుల విక్రయాలు ఎగుమతులతో సహా 22,638 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. కంపెనీ రిఫైనింగ్‌ సామర్ధ్యం 17.35 మిలియన్‌ టన్నులుగా ఉంది. లైన్లద్వారా సరఫరా 21.22 మిలియన్‌ టన్నులున్నట్లు వెల్లడించింది.