రిలయన్స్‌-ఆరామ్‌కో డీల్‌కు అడ్డుకట్ట..

ముఖేష్‌ అంబానీకి షాక్‌

Mukesh Ambani
Mukesh Ambani

న్యూఢిల్లీ: ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానికి షాక్‌ తగలనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో 25శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ సౌదీ ఆరామ్‌కోకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చినట్లు ఇంగ్లీష్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ గ్యాస్‌ (బిపి)పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ ఆఫడవిట్‌ దాఖలు చేయాలని రిలయన్స్‌ డైరెక్టర్లను ప్రభుత్వం కోరింది. కాగా గతంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో మైనార్టీ 20 శాతం వాటా కోసం సౌదీ ఆర్‌మ్‌కో కంపెనీ 1,000నుంచి 1,500కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్ట నుందని వార్తలు వచ్చాయి. దీనిపై రిలయన్స్‌ స్పందించాల్సి ఉంది. రిలయన్స్‌, బీపీలు తమ ఆస్తులను విక్రయించకుండా ప్రభుత్వం ప్రస్తుతానికి నిలుపుదల చేసిందని చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/