భారత్‌ రుణభారం పెరిగిపోతుంది

భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది

international monetary fund
international monetary fund

వాషింగ్టన్‌: భారత ఆర్థిక పరిస్థితులు గతంలో అంచానా వేసిన దానికంటే బలహీనంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అధికార ప్రతినిధి జెర్రీ రైస్‌ తెలిపారు. భారత్‌ రుణభారం పెరిగిపోతోందని ఆ సంస్థ హెచ్చరించింది. భారత్‌ అత్యంత వేగంగా, నిర్మాణాత్మక, సమీకృత ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని కట్టడి చేస్తూ మధ్యకాలిక ఆర్థిక వ్యూహల్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రంగాల పునరుత్తేజానికి ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలపై మాత్రమే బడ్జెట్‌లో దృష్టిసారించారని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా మరింత సర్దుబాటు ఆర్థిక వైఖరిని అనుసరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/