రెండేళ్లలో 597 ఏటీఎంల మూసివేత

ATMS
ATMS

దిల్లీ: దేశంలో ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఓ నివేదికలో చెప్పింది. 2017లో 2,22,300 ఏటీఎంలు ఉండగా 2019 మార్చి నాటికి 2,21,703 ఏటీఎంలకు చేరిందని ఆ నివేదిక చెప్పింది.  ఈ నివేదిక ప్రకారం..నగదు వినియోగం కంటే ఏటీఎంల సంఖ్య కూడా తక్కువగా ఉంది. నగదును జమ చేయడం కంటే ఉపసంహరణ రేటు పెరిగిపోతుంది. ఇక 2012లో 10,832 మందికి గానూ ఒక ఏటీఎం ఉండగా..2017నాటికి ఆ సంఖ్య 5,919.  ఐదేళ్ల కాలంలో కొన్ని బ్యాంకులు ఏటీఎంల విస్తరణ రేటును పెంచాయి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం నిర్వహణ పరమైన సమస్యల కారంణంగా భారం దించుకుంటున్నాయి.