టోకూధరల సూచీ ద్రవ్యోల్బణం పెరుగుదల

న్యూఢిల్లీ : టోకుధరలసూచీ ఆధారితద్రవ్యోల్బణం ఫిబ్రవరినెలలో గణనీయంగాపెరుగుదలనమోదుచేసింది. వార్షికపద్దతిలోచూస్తే ఫిబ్రవరి ద్రవ్యోల్బణం 2.93శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరినెలలో 2.74శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 2.93శాతానికిపెరిగింది. ప్రాథమిక ఉత్పత్తులు ధరలు పెరగుదల, ఇంధనం, విద్యుత్‌ వంటివాటిధరలపెరుగుదల ఇందుకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. జనవరినెలలో టోకుధరలసూచీ ద్రవ్యోల్బణం 2.76శాతంగా నిలిచింది. గత ఏడాది 2.74 శాతం ఫిబ్రవరిలో ఉంటే ఏడాదికాలంలోనే మరింతగాపెరిగింది. వంటగది ఉత్పత్తులైన ఆలుగడ్డలు, ఉల్లి, పండ్లు, పాలు వంటివి 4.84శాతంపెరిగాయి. అంతకుముందు జనవరిలో 3.54శాతం మాత్రమే పెరిగాయి. ఇక ఇంధన, విద్యుత్‌రంగాలకుగాను 2.23శాతంగా ఫిబ్రవరిలోపెరిగాయి. అంతకుముందు జనవరిలో 1.85శాతంనుంచి గణనీయంగా పెరిగాయి. రిజర్వుబ్యాంకు తన మానిటరీ పాలసీ సమీక్షలో ప్రత్యేకించి వినియోగరంగ ఉత్పత్తులధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే రెపోరేట్లను నిర్ణయిస్తుంది. గత సమావేశంలోనే ఆర్‌బిఐ రెపోరేట్లను 0.25శాతం తగ్గించింది.ఈసారి సమీక్షపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంటున్నది.

https://www.vaartha.com/news/business/  
మరిన్ని తాజా వార్తల కోసం బిజినెస్‌ క్లిక్‌ చేయండి :