గోయల్‌ను అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

ముంబయి: జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ దేశం విడిచివెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అయితే వీరిద్దరూశనివారం ఈరోజు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ మీదుగా లండన్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గోయల్ దేశం వదలివెళ్లకుండా ఉండేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో వీరి ప్రయాణాన్ని అడ్డుకున్నట్టు అధికారులు తెలిపారు. గోయల్ దంపతులను విమానం నుంచి దింపారు. వీరు నాలుగు పెద్ద సూట్‌కేసులతో ప్రయాణం చేస్తున్నారని, చెక్డ్ ఇన్ లగేజ్ (సూట్ కేసులు) అనితా గోయల్ పేరు మీద ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ బ్యాగేజీని కూడా విమానం నుంచి దింపేశారు.
క్రీడ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/