ఆర్థిక వృద్ధి అంతంత మాత్రమే: ఐఎంఎఫ్‌

IMF
IMF


న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందనీ, మాంద్యం వెంటాడుతోందనీ మనకు తెలిసిందే. అయితే ఆ మందగమనం కొద్దిగానే అనీ, మాంద్యం పెద్దగా లేదనీ కేంద్రం చెబుతుంటే, ఆ అంచనాల కంటే నీరసంగా భారత ఆర్థిక వ్యవస్థ ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిది (ఐఎంఎఫ్‌) సంస్థ తాజాగా వెల్లడించింది. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థల్లో మందగమనం, పర్యావరణ నిబంధనల్లో అనిశ్చితి, కొన్ని బ్యాంకింగేతర కంపెనీలో వీక్‌నెస్‌ వంటివి భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి బాలేదని చెబుతోంది. 2019-20 సంవత్సరాల్లో భారత వృద్ధిరేటును 0.3శాతం తగ్గించిన ఐఎంఎఫ్‌, అది 7నుంచి 7.2శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలో డిమాండ్‌ తగ్గుతోందని అభిప్రాయపడింది. అయితే ఇప్పటికీ చైనా తర్వాత భారతే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వాషింగ్టన్‌కి చెందిన ఓ అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ సంస్థ అభిప్రాయపడింది. రానురాను వృద్ధిరేటు ఫలితాలు, అంచనాలు తగ్గిపోతున్నాయన్నది ఐఎంఎఫ్‌ అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఏప్రిల్‌ నుంచీ జూన్‌ మధ్య తొలి త్రైమాసికంలో భారత వృద్ధి 8 శాతం ఉండాల్సింది, 5శాతంగా నమోదైంది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/