హ్యుందాయ్‌ మోటార్స్‌ఐ10 నియోస్‌ విడుదల

Watch live launch Video of Grand i10 Nios

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్స్‌ మార్కెట్లోకి సరికొత్త ఐ10 నియోస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు నిర్ణయించారు. పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.4.99లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.70లక్షలుగా ఉంది. దీనిలో టాప్‌ఎండ్‌ ధర రూ.7.99లక్షలు(దిల్లీ ఎక్స్‌షోరూం). ఈ మోడల్‌ కారును త్వరలోనే యూరప్‌ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను హ్యుందాయ్‌ స్వీకరిస్తోంది. ప్రస్తుత మోడల్‌ గ్రాండ్‌ ఐ10తోపాటు సరికొత్త మోడల్‌ కూడా మార్కెట్లో అందుబాటులోకి ఉంటుంది. భారత్‌ మార్కెట్‌ అవసరాలకు తగినట్లు ఈ కారును డిజైన్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/