26న హువావే 5జి తొలి స్మార్ట్‌ఫోన్‌!

HUAWEI 5G smart phone
HUAWEI 5G smart phone

ముంబయి: చైనా టెలికాం యంత్రసామగ్రి ఉత్పత్తి కంపెనీ హువేయి తన మొట్టమొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఈనెల 26వ తేదీనే విడుదలచేస్తున్నట్లు ప్రకటించింది. గతనెలలోనే ప్రభుత్వం దేశంలోని మేజర్‌ కంపెనీలకు 5జి సేవలు ప్రారంభించాలని ఆదేశించిన సంగతి తెలిసింది. ప్రపంచదేశాలు ముందున్న రేసులో శరవేగంగా వచ్చే టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో 5జికి ఇపుడు అగ్రస్థానంలో ఉంది. చైనా, అమెరికా ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో 5జి సేవలప్రారంభం ఇపుడు సంచలనంగా మారింది. హువేయి మేట్‌ 20ఎక్స్‌ పేరిట కంపెనీ కేంద్ర కార్యాలయం షెన్‌జెన్‌లో ఫోన్‌ రూపొందించిందని గ్లోబల్‌టైమ్స్‌ ప్రస్తావించింది.

దేశంలోని అన్ని టెలికాం కంపెనీలకు 5జి సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇక 5జి సేవలు వాణిజ్యీకరణ కూడా సత్వరమేప్రారంభించేందుకు కంపెనీయోచిస్తోంది మొత్తం 5జి పారిశ్రామికీకరణకు అమెరికా,చైనాలుముందు ప్రోత్సాహం ఇస్తున్నాయి. హువేయి కంపనీ 5జి స్మార్ట్‌ఫోన్లకోసం సొంత చిప్‌సెట్‌ కిరిన్‌ను విడుదలచేసింది. హువేయి మేట్‌20ఎక్స్‌ విడుదలతో చైనా 5జి మార్కెట్‌మరింతపెరుగుతుందని అంచనా. 5జి టెక్నాలజీస్‌ పరంగాచూస్తే భావితరం సెల్యులర్‌టెక్నాలజీ పదినుంచి 100 రెట్లు డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో ఉంటుంది.

డ్రైవర్‌లెస్‌ కార్ల తరహాలోనే మొబైల్‌సేవల్లో నెక్స్ట్‌జెన్‌ మొబైల్‌ పరికరాలనుసైతం అందిస్తుంది. బీజింగ్‌ నగరంలోనే ఇందుకోసం 4300 వరకూ 5జి బేస్‌ స్టేషన్లు ఏర్పాటుచేసారు. పట్టణ ప్రాంతాల్లోని కీలక ప్రాంతాల్లో ఐకానిక్‌ భవనాలు సూపర్‌ఫాస్ట్‌ టెక్నాలజీని అమలుచేసేందుకువీలుగా 5జి లైసెన్సులు టెలికాం సంస్థలకు జారీచేసింది. హువేయి సంస్థపై అమెరికా ఆగ్రహానికి ప్రధాన కారణం కేవలం 5జి టెక్నాలజీని ముందుకు తీసుకురావడం అమెరికాకు ఇష్టంలేదని, అందువల్లనే కంపెనీకి చిక్కులు తెస్తోందని చైనా ఆరోపిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/