హౌసింగ్‌ ఫైనాన్స్‌లకు మినహాయింపుల ఉపసంహరణ!

RBI
RBI

ముంబయి: హౌసింగ్‌ కంపెనీలకు ఆర్‌బిఐ ఇచ్చిన కొన్ని మినహాయింపులను ఉపసంహరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఆర్‌బిఐ చట్టం నుంచి కొన్ని మినహాయింపు లున్నాయి. ఇపుడు ఆర్‌బిఐ ప్రతి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని తనిఖీచేసి వాటి స్థిరత్వం సమగ్ర నివేది కలు వంటి వాటిని ఆర్‌బిఐకి పంపించిన తర్వాత వాటిని అధ్యయనం చేసి క్లీన్‌చిట్‌ ఇస్తుంది. నాన్‌బ్యాం కింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల తరహాలోనే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నిబంధనలు కూడా ఉన్నాయి. అయి తే ఆర్థిక చట్టం 2019 ప్రకారం జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌చట్టం 1987లొ సవరణలు తెచ్చారు. హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై రిజర్వు బ్యాంకుకు ఉన్న అధికారాలను పెంచారు. ఇకపై హౌసింగ్‌ఫైనాన్స్‌ కంపె నీలు తమ రుణబకాయిలను సకాలంలో చెల్లించలేనిపక్షంలో ఉత్తర్వులు జారీచేసిన ఐదురోజులలోపు స్పష్టం చేయకపోతే వాటిని మూసివేయాలనన ఆదేశాలు జారీచేసే అధికారాలు కూడా ఆర్‌బిఐకి వచ్చా యి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌రపసంగంలో ఆర్‌బిఐ చట్టం 1934లోని 45-1ఎలో కొన్ని సవరణలు తెచ్చినట్లు వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/