కేబుల్‌ ఆపరేటర్లకు యాజమాన్య హక్కులు!

HINDUJA
HINDUJA

ముంబాయి: హిందుజా వెంచర్స్‌ కేబుల్‌ ఆపరేటర్లకు గిప్ట్‌ను ప్రకటించింది. దీపావళి సమయంలో వారికోసం అనూహ్య ప్రకటన చేసింది. కేబుల్‌ ఆపరేటర్లకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పిస్తూ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. హిందుజా వెంచర్స్‌ ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్‌ బ్రాండుతో ఉంటుందని తెలిపింది. త్వరలోనే ఆపరేటర్లకు వాటాల పంపిణీ సహ స్కీముల వివరాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తుల అమ్మకాలపై కమిషన్‌ సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని ఆ సంస్థ చైర్మెన్‌ అశోక్‌ పి.హిందుజా తెలిపారు. గత 20-24 ఏళ్లుగా మీకు మేం అన్ని విధాల అండగా ఉంటున్నాం. యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం వల్ల మీరంతా దీనిని మీ సొంత కంపెనీగా భావిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని వ్యాపారులుగా చుడాలనుకుంటున్నాం అని హిందుజా అన్నారు కెబుల్‌ ఆపరేటర్లను వాటాదారులుగా మారుస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ఎకైక కార్పోరేట్‌ సంస్థ అన్నారు. వాటదారులను ఉద్దేశిస్తూ మీరు ఒక ఆర్డినరీ పర్సన్‌ కాదనీ, మీరు బిజినెస్‌ పర్సన్‌ అని అన్నారు.
తాజా తెలంగాణ వార్తకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/