హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో భారీ లాభాలు

HDFC bank
HDFC bank

న్యూఢిల్లీ: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63 శాతం నికర లాభాల్లో వృద్ది కనిపించింది. ఈ సీజన్లో రూ.5805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా అది రూ. 5885.12 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సీజన్‌లో రూ.4799 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8 శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో నికర వడ్డీ మిగులు రూ. 4.4 శాతానికి చేరింది. కాకపోతే మొండిబకాయిల ప్రొవిజన్లు కూడా రూ.1541 కోట్ల నుంచి రూ.1889 కోట్లకు పెరిగాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/