జిఎస్‌టిలో కొత్తగా ఇ-ఇన్వాయిస్‌ విధానం!

GST E-invoice
GST E-invoice


న్యూఢిల్లీ: ఎగవేతను అరికట్టేందుకు జిఎస్‌టిలో ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టిన మండలి, అధికారులు ఇప్పడు కొత్తగా జిఎస్‌టి పోర్టల్‌లో ఇ-ఇన్వాయిస్‌ను ప్రవేశపెట్టారు. దీనివల లపూర్తిస్థాయిలో పన్నుల ఎగవేతను అరికట్టేవీలుంటుందని భావిస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ టాక్స్‌ ఇన్వాయిస్‌ లేదా ఇ-ఇన్వాయిస్‌ విధానం ప్రవేశపెడుతోంది. మొత్తం అమ్మకాల విలువలను లెక్కించేందుకు ఈ ఇన్వాయిస్‌ విదానం తోడ్పడుతుంది. పరిమితికి మించిన బిజినెస్‌ టర్నోవర్‌లకోసం ఒక సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. జిఎస్‌టి పోర్టల్‌కు లింక్‌చేసి ఇ-ఇన్వాయిస్‌ను తెరిచేందుకు వీలుంటుంది. ఇ-ఇన్వాయిస్‌ టర్నోవర్‌ ఆధారంగా కాని లేదా రిజిస్టరయి వ్యక్తులు దాఖలుచేసిన ఇన్వాయిస్‌ విలువల ఆధారంగాకానీ ఉంఉంది. టర్నోవర్‌ పరిమితుల ఆధారంగా ముందు డిజిటల్‌ఇన్వాయిస్‌ను నమోదుచేస్తారు. అమ్మకాలను విభజించే విధానం అరికట్టేందుకు వీలుగా ఈ విధానాన్ని తెరమీదికి తెస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/