పెరుగుతున్న ప్రమోటర్ల తనఖాలు!

money
money

ముంబై: ప్రమోటర్ల తనఖా చేసిన వాటా రెండవ త్రైమాసికానికి 2.52శాతానికి పెరిగాయి. జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 2.47శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బిఎస్‌ఇ-500 ఇండెక్స్‌ మొత్తం కేపిటలైజేషన్‌లో 1.24శాతానికి సమానమైన ప్రమోటర్ల ఈక్విటీ షేర్లు తనఖాలో ఉన్నట్లు కోటక్‌ ఇంటర్నేషనల్‌ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. తనఖా పెట్టిన షేర్ల ద్వారా సేకరించిన నిధులు, నిజానికి కంపెనీ రోజువారీ వ్యాపారం సజావుగా నిర్వహించడానికి అవసరమైన వర్కింగ్‌ కేపిటల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. వ్యాపార విస్తరణకు నిధుల సేకరణలో భాగంగా ప్రమోటర్లు తమ షేర్లను కుదవపెడతారు. రెండవ త్రైమాసికంపై రేటింగ్‌ ఏజెన్సీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏజెన్సీలు రేటింగ్‌ను తగ్గించడం, కఠ్‌ినమైన రుణ నిబంధనల వల్ల చాలా బ్యాంకులు కార్పొరేట్‌ రుణాలను ఎంఎస్‌ఎంఇలకు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. చాలా వరకు కార్పొరేట్‌ రుణాలు స్థూల ఎన్‌పిఎలుగా మారాయి. తాజాగా కంపెనీలపై ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గించింది. పన్ను మినహాయింపు నుంచి లాభపడే కంపెనీల షేర్లు ఇప్పటికే 10 శాతానికిపైగా ర్యాలీచేశాయి. ఈ కారణంగా ప్రమోటర్ల హోల్డింగ్‌ విలువ పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/