రూ.999కే విమాన టిక్కెట్‌..

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా!

indigo bumper offer
indigo bumper offer

న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణించాలని భావిస్తున్నారా? అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే. దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా టికెట్‌ ధరలపై డిస్కౌరట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ సమ్మర్‌ సేల్‌లో భాగంగా తగ్గింపు ధరతో టిక్కెట్లను అందిస్తోంది. ఇండిగో సమ్మర్‌ సేల్‌లో భాగంగా దేశీయ విమాన టిక్కెట్‌ ధర రూ.999నుంచి ప్రారంభమవుతోంది. ఇక విదేశీ విమాన టిక్కెట్‌ రూ.3,499నుంచి ఆరంభమవుతోంది. ఈ ఆఫర్‌ జూన్‌ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లను బుకింగ్‌చేసుకున్నవారు జూన్‌ 26 నుంచి సెప్టెంబరు 28 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. కంపెనీ ఆఫర్‌లో భాగంగా 10 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఇండిగో తగ్గింపు ధరతోపాఉట రూ.2000క్యాష్‌బ్యాక్‌ కూడా అందిస్తోంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆఫర్‌ పొందాలంటే లావాదేవీ విలువ కనీసం రూ.4,000ఉండాలి. అదే ఐసిఐసిఐ బ్యాంకు డెబిట్‌ కార్డుగానీ, క్రెడిట్‌ కార్డుదారులకు రూ.1,000వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. లావాదేవీ విలువ కనీసం రూ.6,000ఉండాలి. ఇకపోతే టికెట్లకు ఎయిర్‌పోర్ట్‌ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులు అదనంగా ఉంటాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/