12మంది ఐటి అధికారులకు నిర్బంధ పదవీవిరమణ

అవినీతి, కుంభకోణాలే కారణం

incometax
incometax

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో 12 మంది సీనియర్‌ ఐటి అధికారులను నిర్బంధ పదవీవిరమణ చేయాలని ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆదేశాలుజారీచేసింది. రాష్ట్రపతి ఈ 12 మంది అధికారులను మంగళవారం మధ్యాహ్నానికే వారిని పదవీవిరమణచేయించేటట్లు ఉత్తర్వులు జారీచేసారు. కమిషనర్‌, జాయింట్‌కమిషనర్‌, అదనపు కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌స్థాయి అధికారులపై మొత్తం 12 మంది అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ వివరాలప్రకారం ఎసి రామ్‌కుమార్‌ భార్గవ లక్నో, కోచికిచెందిన కమిషనర్‌ అలోక్‌కుమార్‌మిత్ర, నోయిడా కమిషనర్‌ సంజ§్‌ుకుమార్‌ శ్రీవాస్తవ,

కోచికి చెందిన కమిషనర్‌ అరులప్ప బి, కోల్‌కత్తా కమిషనర్‌ అజ§్‌ుకుమార్‌సింగ్‌, గుజరాత్‌కమిషనర్‌ బిబి రాజేంద్రప్రసాద్‌, తమిళనాడు కమిషనర్‌ హోం రాజ్‌వంశ్‌, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న గౌహతి కమిషనర్‌ శ్వేతాబ్‌సుమన్‌, భువనేశ్వర్‌ అదనపు కమిషనర్‌ అందాసు రవీందర్‌, తమిళనాడు అదనపు కమిషనర్‌ వివేక్‌ బాత్రా, న్యూఢిల్లీ జెసి అశోక్‌కుమార్‌ అగర్‌వాల్‌, అలహాబాద్‌ అదనపు కమిషనర్‌ చందర్‌సైన్‌ భర్తి తదితరులున్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రాథమిక నియమనిబంధనలు రూల్‌566 అనుసరించి రాష్ట్రపతి ఈ అధికారులను తక్షణమే రిలీవ్‌చేస్తారని ఉంది. ఈ ప్రత్యేకమైన నిబందన గ్రూప్‌ ఎ, బి అధికారులు 35 ఏళ్లకు ముందు సర్వీసులోనికి వచ్చినా 50 ఏళ్ల వయసు వచ్చిన అధికారుల అందరికీ అమలవుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/