విద్యుత్‌ వాహనాల కోసం 2,636 ఛార్జింగ్‌ కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌కు 266, తెలంగాణకు 138 కేంద్రాలు కేంద్రమంత్రి

Prakash Javadekar
Prakash Javadekar

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనదారుల కోసం దేశంలో 62 నగరాల్లో త్వరలో 2,636 ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. వీటికి అనుమతులను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మంజూరు చేసిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు 266, తెలంగాణకు 138 కేంద్రాలను కేటాయించారు. దేశంలోని 24 రాష్ట్రాల్లో ఫేమ్‌ (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా) కార్యక్రమం రెండో విడతలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటిలో 1,633 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు కాగా మిగిలినవి 1,003 సాధారణ ఛార్జింగ్‌ కేంద్రాలు, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. వీటి ఏర్పాటుతో వాహన తయారీదారులు కూడా వీటిపై దృష్టిసారిస్తారని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/