ఎయిర్‌ ఇండియాలో 100%వాటా సేల్

Air India
Air India

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో పూర్తిగా 100 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుందని కేంద్ర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఎఐఎస్‌ఎఎం)ను తిరిగి ఏర్పాటు చేశామని, సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఎఐఎస్‌ఎఎం పూర్తిగా ఆమోదించిందని అన్నారు. ఈ సంవత్సరం బిడ్ నిబంధనలు సులభతరం చేశామని తెలిపారు. గత సంవత్సరంలో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించడానికి మోడీ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. అయితే దీనికి కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. దీని తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ విఫలం కావడానికి కారణాలపై నివేధిక రూపొందించి, తదనుగుణంగా మార్పులు చేపట్టామని మంత్రి వివరించారు. ఎయిర్ ఇండియా చాలా కాలంగా నష్టాల్లో ఉంది. సిబ్బందికి వేతనాలు చెల్లించ లేక ఇబ్బందులు పడుతోంది. 201819లో సంస్థకు రూ.8,556.35 కోట్ల నష్టం (తాత్కాలిక) ఏర్పడింది. ఈ విమానయాన సంస్థకు రూ .50,000 కోట్లకు పైగా రుణం ఉంది. అందువల్ల ఎయిర్ ఇండియాను అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి నాటికి అమ్మకాల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/