జెట్‌ సిబ్బంది కోసం ప్రత్యేక ప్రభుత్వ పోర్టల్‌!

Jet Airways
Jet Airways


న్యూఢిల్లీ: మూసివేతలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌ద్వారా జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు ఇతర ఎయిర్‌లైన్స్‌లో అవకాశాలు లభించేలా కార్యాచరణను అమలుచేస్తోంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఇతర ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. స్పైస్‌జెట్‌, ఇండిగో సంస్థలను కూడా ఇందుకు సంబంధించి చర్చలు జరిపింది. ఆ శాఖమంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి మాట్లాడుతూ వెబ్‌సైట్‌ను మొత్తం జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందితో భర్తీచేస్తామని, వీరందరికీ ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ వెబ్‌సైట్‌లో జెట్‌ఎయిర్‌లైన్స్‌లోని ప్రతి ఉద్యోగినిని జాబితాచేస్తామని, అందువల్ల వారు తిరిగి ఉపాధిని పొందేందుకు అవకాశం ఉంటుందని పూరీ రాజ్యసభలో వెల్లడించారు. అయితే ప్రైవేటు జెట్‌ బిజినెస్‌ వైఫల్యానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని అన్నారు. జెట్‌ఎయిర్‌వేస్‌పరంగా మంత్రి మాట్లాడుతూ ఇదొక సున్నితమైన వ్యాపార వైఫల్యం అని ప్రభుత్వపరంగా ఎంతమేర సాయం చేయగలం అన్నదే ఇపుడు పరిశీలనచేస్తున్నట్లు వివరించారు. నగదు సమస్యతో సతమతం అవుతున్న జెట్‌ఎయిర్‌వేస్‌ మొత్తం కార్యకలాపాలను ఏప్రిల్‌ 17వ తేదీ నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అందువల్ల ప్రభుత్వం తన స్లాట్‌లను విదేశీ ట్రాఫిక్‌రైట్లను పోటీ సంస్థలకు కేటాయించాల్సి వచ్చింది. బ్యాంకర్లు ఈ ఎయిర్‌లైన్స్‌కు సుమారు ఆరువేలకోట్ల వరకూ రుణాలిచ్చాయి. ఎస్‌బిఐ బ్యాంకర్ల కూటమిగా వ్యవహరిస్తోంది. మొత్తం 20వేలమందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొన్ని వందలమంది ఇతర క్యారియర్లలో ఇప్పటికే చేరారు. ఎయిర్‌పోర్ట్సు ఎకనిమక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా సవరణబిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పాక్‌ గగనతలం మూసివేత వల్లనే విమానయాన ధరలు పెరిగినట్లు రాజ్యసభలోమంత్రిదృష్టికి పలువురు సభ్యులు తీసుకువచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/