మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

Nirmala Sitharama
Nirmala Sitharama

ఢిల్లీ: భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో సహా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుందని నిన్న జరిగిన భారత్‌-స్వీడన్‌ వాణిజ్య సదస్సులో ఆమె పేర్కొన్నారు. బ్యాంకింగ్‌, మైనింగ్‌ లేదా ఇన్సూరెన్స్‌ మరియు ఇతర రంగాలలో సంస్కరణలకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. దేశంలో పెద్ద మొత్తంలో ఉన్న మధ్య తరగతి ప్రజలు, భారీ వినియోగం గొప్ప అవకాశాలుగా ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని ఆమె స్వీడన్‌ సంస్థలను ఆహ్వానించింది. వచ్చే ఐదు సంవత్సారాలలో మౌలిక సదుపాయాల రంగంలో సుమారు రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలని భారత ప్రభుత్వం యోచిస్తుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/