టొటోక్‌ యాప్‌ను తొలగించిన గూగుల్‌, ఆపిల్‌

Google and Apple
Google and Apple

ముంబై : గూగుల్‌, ఆపిల్‌ తమ స్టోర్‌ నుంచి ఓ యాప్‌ను తొలగించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన టొటోక్‌ యాప్‌ను తొలగించాయి. ఈ యాప్‌ యుఎఇకి స్పైగా పనిచేస్తోందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే వారి కదలికలు, ఇతర సమాచారాన్ని యుఎఇ ప్రభుత్వానికి పంపిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్‌ను తొలగించాయి. తమ యాప్‌ను టెక్నికల్‌ సమస్యల వల్ల ప్రస్తుతం ఆపిల్‌ స్టోర్‌, గూగుల్‌ స్టోర్‌ నుంచి తొలగించారని టొటోక్‌ పేర్కొంది. గూగుల్‌ గత గురువారం ఈ యాప్‌ను తొలగించింది. ఈ యాప్‌ తమ విధానాలకు భిన్నంగా ఉందని పేర్కొంది. మరోవైపు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆపిల్‌ తెలిపింది. ఈ యాప్‌ ఓనర్‌కు అబుదాబీలోని ఓ హ్యాకింగ్‌ కంపెనీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనిపై ఎఫ్‌బిఐ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్‌ చాలా నెలలుగా ఉపయోగిస్తున్నారు. మిడిల్‌ఈస్ట్‌, యూరోప్‌, ఆసియా, ఆఫ్రికా, నార్త్‌ అమెరికా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గూగుల్‌ ఈ యాప్‌ను తొలగించడానికి ముందే 5 మిలియన్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక, యాప్‌ ట్రాకర్‌ ఆప్‌-యాన్నీ ప్రకారం గత వారం అమెరికాలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయిన యాప్‌ టొటోక్‌ కావడం విశేషం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/