ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త

SBI
SBI

ముంబయి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈరోజు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. కారు లోన్ తీసుకునే వారికి తక్కువ వడ్డీకే.. 8.70 శాతం వడ్డీ రేటు నుంచే లోన్ ఇస్తామని ఎస్‌బీఐ ప్రకటించింది. అంతేకాదు, రూ.20 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలపై కూడా 10.75 వడ్డీ రేటుతో మొదలుకుని ఆరేళ్ల తిరుగు చెల్లింపు వ్యవధితో లోన్‌ను అందించనున్నట్లు తెలిపింది. రూ.50 లక్షల దాకా ఎడ్యుకేషన్ లోన్ కూడా 8.25 శాతం వడ్డీ నుంచి మొదలకుని 15 ఏళ్ల తిరుగు చెల్లింపు వ్యవధితో మంజూరు చేస్తామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/