ఎస్‌బిఐ ఖాతాదారులకు శుభవార్త

SBI
SBI

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బిఐ యాప్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు ఛార్జీల నుంచి ఊరట లభించనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎస్‌బిఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ ఎండి మాట్లాడుతూ..భారత ప్రభుత్వ విజన్‌లో భాగమైన డిజిటల్‌ ఎకానమీలో భాగమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/