పసిడి ఫ్యూచర్స్‌లో భారీ పతనం!

gold
gold


న్యూఢిల్లీ: బంగారంధరలు ఒక్కసారిగా 1700 రూపాయలు తగ్గింది వెండిధరలు కూడా అదేస్థాయిలో తగ్గుతున్నాయి.భారత్‌లో బంగారంధరలు ఒక్కసారిగా గరిష్టానికి పెరిగిన తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. వెండిధరలు కూడా అంతేవేగంతో పడిపోతున్నాయి. ఇక ఎంసిఎక్స్‌లో అక్టోబరు పసిడి ఫ్యూచర్స్‌ ధరలు 0.26శాతం మందగించి పదిగ్రాములు 38,154కి చేరాయి. నష్టాలు 1730రూపాయలుగా ఉన్నాయి. ఒకదశలో గరిష్టస్థాయిలో 39,885 రూపాయలకు చేరింది. వెండిధరలు కూడా అదేస్థాయిలో వేగంగాపడిపోతున్నట్లు ఎంసిఎక్స్‌ ఫ్యూచర్స్‌ చెపుతున్నాయి. కిలో ఒక్కింటికి 47,686 రూపాయలనుంచి 0.23శాతంగాఉనానయి. గరిష్టంగా 51,489 రూపాయలవరకూ చేరినధరలు ఒక్కసారిగా కిలోకు 3800పడిపోయాయి. అంతర్జాతీయంగా బంగారంధరలు కూడా ఔన్స్‌ ఒక్కింటికి 1550 డాలర్లనుంచి 1500 డాలర్ల దిగువకు వచ్చేసాయి. దేశీయ ధరలు కూడా కొంతమేర విఘాతం కలిగినట్లే భావించాలి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్‌ బంగారంధరలు 1491 డాలర్లుగా నిలిచాయి. ఇక బంగారంధరలు దీర్ఘకాలంగాచూస్తే పెరిగే అవకాశాలునానయని సిటీబ్యాంకు వివ్లేషకులు చెపుతున్నారు. ఒకదశలో ఔన్స్‌ బంగారందరలు రెండువేల డాలర్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని సిటీబ్యాంకు విశ్లేషిస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/