రూ. 2,400 తగ్గినా బంగారంపై కనబడని ఆసక్తి

Gold
Gold

న్యూఢిల్లీ: బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు వివిధ కారణాలతో గత నాలుగు రోజులుగా ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్ ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.30 శాతం తగ్గి రూ.37,597గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.20 శాతం తగ్గి రూ.43,465గా ఉంది. సెప్టెంబర్ నెలలో బంగారం రూ.40,000 మార్క్ దాటింది. ఆ రికార్డ్ గరిష్ట ధరతో పోలిస్తే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 తగ్గింది. ధరలు తగ్గినప్పటికీ భారత్‌లో ఫిజికల్ బంగారానికి డిమాండ్ అంతగా పెరగలేదట. ప్రస్తుతం పెద్దగా పెళ్లిళ్లు, ఎలాంటి పండుగ సీజన్ లేదు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొనుగోళ్లు అంతగా పెరగలేదని చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/