2019లో భారీగానే పెరిగిన బంగారం ధర

Gold
Gold

న్యూఢిల్లీ: బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం బాగానే ఉంది. ఈ కారణంగా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఎంసిఎక్స్‌ లో 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగి రూ. 38,101 కి చేరింది. ఫ్యూచర్‌ మార్చ్‌ రూ.45,129 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అమెరికా-చైనా తదుపరి ఒప్పందంపై అంతర్జాతీయ మదుపరులు దృష్టి సారించడంతో సోమవారం బంగారం ధరలు ఔన్సుకు 1,479 డాలర్లుగా ఉంది. అయితే 2019 వ సంత్సరంలో మాత్రం బంగారం ధర ఏకంగా 20 శాతం పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ధర సెప్టెంబర్‌ నెలలోని గరిష్ట రికార్డ్‌ రూ.40వేలతో పోల్చుకుంటే రూ.2 వేలు కంటే తక్కువగానే ఉంది. అయినప్పటికీ బంగారం ధర భారీగానే పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/