నేడు దిగొచ్చిన పుత్తడి ధర

భారత్‌లో పది గ్రాముల బంగారం ధర 46,978

gold
gold

ముంబయి: పుత్తడి ధర గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతుంది. అయితే ఈరోజు ఆ ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 11 డాలర్లు తగ్గి 1,742.50 డాలర్లకు చేరడంతో ఆ ప్రభావం దేశవాళీ బులియన్ మార్కెట్ పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ ఉదయం 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 288 తగ్గి రూ. 46,978కి చేరింది. బంగారం ధర రూ. 46,500 పైన స్థిరంగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/