స్పెన్సర్స్‌ చేతికి గోద్రెజ్‌ నేచర్‌ సంస్థ


కోల్‌కతా: రిటైల్‌చైన్‌లో దూసుకు పోతున్న స్పెన్సర్స్‌ సంస్థ తాజాగా గోద్రెజ్‌కు చెందిన నేచర్‌ బాస్కెట్‌ను 300 కోట్లకు కొను గోలు చేయాలని నిర్ణయించింది. ఆర్‌పి సీజీవ్‌ గోయంకా గ్రూప్‌ స్పెన్సర్స్‌ రిటైల్‌ను కొనసాగి స్తున్న సంగతి తెలిసిందే. తాజా పండ్లు కిరాణ, రెడీమేడ్‌ గార్మెంట్లకు పేరుగాంచిన ప్రీమియం మార్కెట్‌ స్పెన్సర్స్‌ ఇపుడు గోద్రెజ్‌ నిర్వహిస్తున్న నేచర్‌బాస్కెట్‌ను పూర్తి నగదు మొత్తం డీల్‌గా కొనుగోలుకు ముందుకువచ్చింది. దీనితో పశ్చిమ ప్రాంత దేశంలో స్పెన్సర్స్‌ మార్కెట్‌ను పెంచ గలిగినట్లువుతుంది. నేచర్‌బాస్కెట్‌ 2005లోనే కార్యకలాపాలు ప్రారంభించింది. 338.3 కోట్ల టర్నోవర్‌తో ఉంది. గత ఏడాది 289 కోట్ల కంటే 17శాతం పెరిగింది. ముంబయి, పుణె, బెంగ ళూరుల్లో 36 ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది. మూడు నెలల్లోనే ఈ కొనుగోలు డీల్‌ను పూర్తిచేయాలని స్పెన్సర్స్‌ హెడ్‌ శాశ్వత్‌ గోయంకా వెల్లడించారు. దీనితో తమ సంస్థ దేశవ్యాప్త రిటైల్‌చైన్‌గా మారు తుందన్నారు. ప్రస్తుతానికి స్పెన్సర్స్‌ రుణభారం లేని కంపెనీలగా కొనసాగుతోంది. గోద్రెజ్‌కు సంఘటిత రంగంలోని రిటైల్‌ వ్యాపారం ప్రాధా న్యేతర బిజినెస్‌గా మాత్రమే కొనసాగిస్తుండటంతో స్పెన్సర్స్‌ కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు ఈరంగంలో మార్కెట్‌ నిపుణులు చెపుతున్నారు.