గోఎయిర్‌ మూడు రోజుల పాటు ఆఫర్‌ టికెట్లు

go air
go air

ముంబై: విమాన ప్రయాణానికి కేవలం రూ. 899 నుంచి ఆఫర్‌ టికెట్లు విక్రయించనున్నట్లు గో ఎయిర్‌ ప్రకటించింది. జూన్‌ 15 నుంచి డిసెంబరు 31 మధ్య విమాన ప్రయాణం కోసం అందుబాటులో ఉండేలా 10 లక్షల టికెట్లను ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు విక్రయిస్తామని తెలిపింది. కనీసం రూ. 2499 లావాదేవికి పేటిఎం వాలెట్‌ ద్వారా రూ. 500, రూ. 1999 లావాదేవికి మిత్రా యాప్‌లో 10 శాతం రాయితీ లభిస్తుంది. జూమ్‌కార్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే, రూ. 1500 లేదా 20 శాతం రాయితీ లభిస్తుంది. ఫాబ్‌ గో ఎయిర్‌ కూపన్‌ వాడితే 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/