గ్లెన్‌మార్క్‌ జోరు, హెచ్‌యూఎల్‌ డీలా

ముంబై : వేలియంట్‌ బెర్ముడా ఉతప్రత్తి బెంజాక్లిన్‌ జెల్‌కు జనరిక్‌ వెర్షన్‌ ఔషధాన్ని విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డిఎ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించడంతో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు జోరందుకుంది. ఈ ఔషదానికి దాదాపు 10 కోట్ల డాలర్ల మార్కెట్‌ ఉన్నట్లు అంచనా. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 2.2శాతం పెరిగి రూ.645 వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.652 వరకూ పెరిగింది. కంపెనీలో ప్రమోటర్లకు 46.54శాతం వాటా ఉంది. హెచ్‌యూఎల్‌ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో అమ్మకాల పరిమాణం 10 శాతం దిగువకు చేరే అవకాశమున్నట్లు సంస్థ తెలియచేసింది. గత ఏడాదిన్నర కాలంలో ఇది కనిష్టం కాగా, గత ఐదు త్రైమాసికాలలో అమ్మకాల పరిమాణం సగటున 11 శాతం స్థాయిలో నమోదవుతూ వస్తోంది. అయితే నాలుగవ త్రైమాసికంలో 6నుంచి 7 శాతానికి పరిమితం కావచ్చని కంపెనీ భావిస్తోంది. ఇటీవల విశ్లేషకులు, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు తదితరాలతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో భాగంగా కంపెనీ గైడెన్స్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 2.3శాతం పతనమై రూ.1700వద్ద ట్రేడవుతోంది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: