20 శాతం వృద్దిని నమోదు చేసిన గెయిల్‌

GAIL
GAIL

ముంబై: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(గెయిల్‌) మార్చి త్రైమాసిక నికర లాభాల్లో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. గ్యాస్‌ వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికి, పెట్రోకెమికల్‌ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. మొత్తం మీద జనవరి-మార్చి త్రైమాసికానికి రూ. 1,222 కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది ఇదే సీజన్‌లో వచ్చిన రూ. 1,020 కోట్ల కంటే దాదాపు 19 శాతం అధికంగా లాభం వచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరి ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్బంగా 1:1 షేర్‌ను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/