ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..ప్రయాణికులకు ఎంత లాభం?

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం, ప్రయాణికులు నష్టపోకుండా భారతీయ రైల్వే సంస్కరణలు చేపడుతోంది. అనేక చర్చలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి పిఎన్‌ఆర్‌ లింకింగ్‌. ప్రయాణికులకు మేలు చేసేందుకు రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయమిది. పిఎన్‌ఆర్‌ లింకింగ్‌ దూరప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు లాంగ్‌ టైర్‌ ప్లాన్‌ చేసుకొని ఒకేసారి రెండు, మూడు రైళ్లు కనెక్ట్‌ అయ్యేలా టికెట్‌ బుక్‌ చేసుకొని ఉంటారు. గమ్యస్థానానికి నేరుగా రైలు లేకపోతే చాలా మంది ఇలా కనెక్టింగ్‌ రైళ్లను బుక్‌ చేసుకోవడం మామూలే. దీనివ్ల ఇన్నాళ్లూ ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయే వాళ్లు. ప్రయాణికులు అలా నష్టపోకుండా వాటిని అనుసంధానించడమే పిఎన్‌ఆర్‌ లింకింగ్‌. దీని ద్వారా మీ రెండో రైలు మిస్‌ అయితే రీఫండ్‌ పొందడం సులువు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పిఎన్‌ఆర్‌ లింకింగ్‌ ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా రీఫండ్‌ పొందవచ్చు. ఈ సదుపాయం అన్ని క్లాసుల టికెట్లకు వర్తిస్తుంది. రెండు టికెట్లపై ప్యాసింజర్‌ వివరాలు ఒకేలా ఉండాలి. మొదటి రైలులో మీరు ఎంచుకున్న గమ్యస్థానం, రెండో రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌ ఒకటై ఉండాలి.

https://www.vaartha.com/news/business/మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: