ఆతిథ్యం, ఆటోమొబైల్‌పైనే ఎక్కువ ఫోకస్‌

nirmala
nirmala


న్యూఢిల్లీ: పన్నుల తగ్గింపులతో ఆర్థికవృద్దికి ఊతం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ఇపుడు ఆటోమొబైల్‌, అతిథ్యరంగాలకు ఊతం ఇచ్చేందుకువీలుగా శుక్రవారం జరిగే జిఎస్‌టి మండలిలో ఈ రెండురంగాలపైనే విస్తృత స్థాయి చర్చలు జరగుతున్నాయి. పన్ను లతగ్గింపుతో ఇపుడు హోటళ్లలో గదుల అద్దెలు రూ.7500గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం 28శాతం జిఎస్‌టి వర్తింపచేస్తున్న ఈ రేట్‌ను 18శాతానికి తగ్గించాలనిచెపుతున్నారు. లాటరీ టికెట్లపై పన్నురేట్‌ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురకాల రేట్లను ఈ రంగానికి వర్తింపచేయాలన్న డిమాండ్‌ వినిపించింది. గోవాలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎక్కువగా ఆటోమొబైల్‌రంగంపైనే చర్చలుజరిగాయి. ఉపాధికల్పనఅధికంగా ఉంటే ఆతిథ్యరంగంపై భారీ పన్ను వద్దన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. పర్యాటకరంగాన్ని మరింత వృద్ధిచేయడమే తమ లక్ష్యమన్న భావనతో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాల ఆర్ధికమంత్రుల మద్దతును కూడా ఇందుకు కూడగడుతోంది. విలాస వంతమైన హోటళ్లకు మాత్రం ఇపుడు జిఎస్‌టి మినహాయింపులు ఉండవద్దన్న డిమాండ్‌ ఉంది. ఇక ఔట్‌డోర్‌ కేటరింగ్‌ సేవలపై కూడా జిఎస్‌టి వసూలుచేస్తున్నారు. ఈ రంగంలోనే అత్యధికంగా నిపుణులు, కొత్తవారు, పాక్షిక నిపుణులు ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటున్నందున పన్నులు తొలగించాలని డిమాండ్‌చేస్తున్నారు. రాష్ట్రపరిదిలో విక్రయించే లాటరీ టికెట్లకు 12శాతం, బైటి ప్రాంతంలో అయితే 28శాతం వసూలుచేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/