త్వరలో హోల్‌సేల్‌ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్‌

flipkart-s-wholesale-unit-may-go-live-next-quarter
flipkart-s-wholesale-unit-may-go-live-next-quarter

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఈ-కామర్స్‌్‌ వెబ్‌సైట్‌ ప్లిప్‌కార్ట్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌ నుండి తన హోల్‌సెల్‌ వ్యాపారాన్ని ప్రారంభించనుందట. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2020-21 తొలి క్వార్టర్‌లో ప్రారంభించవచ్చు. ఆమెజాన్‌ బి2బి డివిజన్‌తో పాటు రిలయన్స్‌ మార్కెట్‌, టెన్సెంట్‌కు చెందిన ఉడాన్‌ లాంటి ఈ-కామర్స్‌ స్టార్టప్స్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు గత కొన్ని నెలల నుంచి తన సప్ల§్‌ు చైన్‌ను పెంపొందిచుకోవటం కోసం పాటు ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతుంది. ఢిల్లీ -ఎన్‌సిఆర్‌లోని కిరాణా దుకాణాలకు సరుకుల్ని సరఫరా చేసేందుకు ప్రయోగాత్మకంగా ఎఫ్‌ఎమ్‌సిజి ప్రాజెక్టును నడుపుతోందని చెబుతున్నారు. కిరాణ దుకాణాలకు సరఫరా చేసే సరుకుల సేకరణని పెంపొందించేందుకు అవసరమయ్యే పెట్టుబడుల విషయమై బి2బి ఎఫ్‌ఎమ్‌సిజి సప్ల§్‌ు చైన్‌ స్టార్టప్‌ జంబోటెయిల్‌తో కూడా ప్లిప్‌కార్ట్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/