ఫ్లిప్‌కార్ట్‌కు భారీ రాబడులు

flipkart
flipkart

న్యూఢిల్లీ: సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న వాల్‌మార్ట్‌ అధీనంలోని ఇకామర్స్‌ స్టార్టప్‌ ఫ్లిప్‌కార్ట్‌ రాబడుల్లో భారీగా వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది స్టాక్‌ఎక్ఛేంజిలకు ఇచ్చిన సమాచారం ప్రభుత్వ సంస్థలకు వచ్చిన సమాచారంతో చూస్తే ఆగ్నేయాసియా ప్రభుత్వంలోని సంస్థ 42శాతం టర్నోవర్‌ను పెంచుకున్నట్లు తేలింది. ఫ్లిప్‌కార్ట్‌ రాబడులు 43,615 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 30,644 కోట్లతో పోలిస్తే మరింతగా పెరిగాయి. కంపెనీ నష్టాలను తగ్గించుకుంటూ వస్తోంది. 63శాతం క్షీణించి 17,231 కోట్లుగా ఉంది. ఒక్కసారిగా జరిగిన వ్యయంతో గత ఏడాది మాత్రమే నష్టాలు పెరిగాయి. ఆ తర్వాత క్రమేపీ తగ్గించుకోగలిగింది. ఇతర ఖర్చుల పరంగా ఉద్యోగుల ప్రయోజనాలు, తరుగుదల, విదేశీ ఎక్ఛేంజి ఇతర ఖర్చులు గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయి. ఆర్థికవనరులపరంగా ఖర్చులు కూడా గత ఏడాది కొంతమేర తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకులు బిన్ని బన్సాల్‌ కంపెనీలో ఐదుశాతం వాటాను కొనసాగిస్తున్నారు. మరొక సహవ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌ పూర్తిగా వైదొలిగారు.