ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌

flipkart big shopping days
flipkart big shopping days

ఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ ప్రారంభమయ్యాయి. ఈ అవకాశం డిసెంబర్‌ 1నుంచి 5వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. కాగా చైనీస్ మొబైల్ మేకర్ వివో కంపెనీ పలు ఫోన్లపై రాయితీలు ప్రకటించింది. డిసెంబరు 3 నుంచి 5 వరకు అమెజాన్‌లో వివో కార్నివాల్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా డీల్స్, డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్‌లో వివో జడ్1ప్రొ, వివో జడ్1ప్రొ, వివో జడ్ 1 ఎక్స్, వివో ఎస్1, వివో వి15 ప్రొలపై డిస్కౌంట్లు ప్రకటించగా, అమెజాన్‌లో వివో యూ10, వివో ఎస్1, వివో వి15 ప్రొలపై రాయితీలు ఆఫర్ చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ డిసెంబరు 5తో ఆఫర్లు ముగియనున్నాయి. అన్ని ఫోన్లపైనా రూ.1000 తగ్గింపుతోపాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ప్రకటించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/