మార్చి 31వ తేదీలోపు మీరు చేయాల్సిన కొన్ని ఫైనాన్షియల్‌ టాస్క్స్‌

march 31 calendar
march 31 calendar

న్యూఢిలీ : 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో వారం రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఏప్రిల్‌ 1వ తేదీలోపు వివిధ రంగాలకు చెందిన వారు తమ తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పూర్తిచేయాల్సి ఉంది. ఐటి రిటర్న్స్‌ దాఖలు, ఆధార్‌-పాన్‌కార్డు లింకింగ్‌ ఇలా ఎన్నో పూర్తిచేయాలి. 2017-18 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుకు చివరి తేదీ 31 మార్చి 2019. ఇక్కడ రెండు అంశాలను గుర్తుంచుకోవాలి. ఆలస్యంగా దాఖలు చేస్తున్నందుకు మీరు పైన్‌ చెల్లించవలసి ఉంటుంది. డెడ్‌లైన్‌ దాటితే రిటర్నులు దాఖలు చేయలేరు. తొలి డెడ్‌లైన్‌ తర్వాత రిటర్నులు ఫైల్‌ చేస్తున్నందుకు 234ఎఫ్‌ సెక్షన్‌ కింద టాక్స్‌ పేయర్‌ రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. 2017-18 ఐటి రిటర్నులకు ఆఖరు తేదీ 31 ఆగస్టు 2018. ఈ తేదీ నుంచి 31 డిసెంబరు 2018 వరకు పై జరిమానా ఉంటుంది. డిసెంబరు 31వ తేదీ దాటితే రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. ఒకవేల టాక్స్‌పేయర్‌ ఆదాయం రూ.5లక్షలకు తక్కువగా ఉంటే రూ.వెయ్యి కంటే పెరగదని అంటున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. లాంగ్‌ టర్మ్‌ కేపిటల్‌ గెయిన్స్‌ కోసం ఈక్విటీ సంబంధిత పెట్టుబడులు పెడితే రూ.లక్ష వరకు మాత్రమే టాక్స్‌ ఉండదు. మార్చి 31వ తేదీకి ముందే పిపిఎఫ్‌ (పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో రూ.500జమ చేయడం, ఎన్‌పిఎస్‌ (నేషనల్‌ పెన్షన్‌ స్కీం)కు ఏడాదికి కనీసం రూ.వెయ్యి ట్రాన్సుఫర్‌ చేయడం ద్వారా దాదాని యాక్టివ్‌గా ఉంచవచ్చు. మీరు ఇన్సురెన్స్‌ ప్రీమియం గానీ, ఎస్‌ఐపిలు ఈ ఏడాదికి చెల్లించినప్పటికి క్లెయిమ్‌ చేయాల్సిన రూ.1.50కు గరిష్టంగా ఉంటే మీరు మీ పిపిఎఫ్‌, ఎన్ఫీఎస్‌ను పెంచుకోవచ్చు. టాక్స్‌ పేయర్స్‌ వారి టాక్స్‌ ప్లానింగ్‌ పూర్తికాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇన్సురెన్స్‌ పాలసీలు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెడితే ఏళ్లపాటు చెల్లించాలనే ఆందోళన అవసరం లేదు. అలాంటి సమయంలో అయిదేళ్లపాటు ఉంటే బెస్ట్‌ టాక్స్‌ సేవింగ్‌ ప్లాన్‌ను ఎంచుకోండి. బ్యాంకు డిపాజిట్లు గానీ, ఎన్‌ఎస్సీగానీ వీటిల్లో రిటర్నులు తక్కువగా ఉంటాయి. అయితే ఇది టాక్సబుల్‌. పిపిఎఫ్‌, సుకన్య స్కీంల కోసం చివరి తేదీ వరకు వేచి చూడవద్దు.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/