ఫిట్చ్‌ రేటింగ్స్‌ అంచనా.

FITCH RATINGS
FITCH RATINGS

న్యూఢిల్లీ,: అంతర్జాతీయ రేటింగ్స్‌లో భారత్‌ఆర్ధికవృద్ధి ఈ ఆర్ధికసంవత్సరంలో కొంతమేర తగ్గే అవకాశాలున్నట్లు చెపుతున్నాయి. 2020 ఆర్ధికసంవత్సరానికి వృద్ధిరేటు 6.8శాతంగా మాత్రమే ఉంటుందని ఫిట్చ్‌ రేటింగ్స్‌ అంచనావేసింది. 2021 సంవత్సరానికి కూడా 7.1శాతం మాత్రమే ఆర్ధికవృద్ధి ఉంటుందని వెల్లడించింది. అంతకుముందు ఇదే సంస్థ ఆర్ధికవృద్ధి అంచనాలను 7శాతంగాను, 2021 నాటికి 7.3శాతంగాను అంచనావేసిన సంగతి తెలిసిందే. ఫిట్చ్‌రేజింగ్స్‌ ప్రకారంచూస్తే ఆర్‌బిఐ మరింతగా నిఘానేత్రాన్ని అనుసరిస్తోందని తెలుస్తోంది. ఫిట్చ్‌ పరంగాచూస్తే వడ్డీరేట్లు 0.25శాతం మేర తగ్గించవచ్చని అంచనా. ఫిబ్రవరిలో ఇప్పటికే 0.25శాతం తగ్గించింది. ప్రస్తుతం మారేట్‌ ఔట్‌లుక్‌ను తగ్గించింది. 25 బేసిస్‌ పాయింట్లు కోతతో ద్రవ్యోల్బణం మరింత సడలే అవకాశం ఉందని అంచనా. ఇక ఆర్ధిక వృద్ధిపరంగా చూస్తే 2020 ఆర్ధికసంవత్సరంలో నగదు బదిలీలు మరింతగా ఉండే అవకాశం ఉంది. ఫిట్చ్‌ రేటింగ్స్‌తన నివేదికలో ముడిచమురుధరలను సైతం ప్రస్తావించింది. పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు ఇందుకు మరికొంత మద్దతిస్తాయి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ఆదాయం, వినియోగం కూడా పెరిగే అవకాశం ఉందని ఫిట్చ్‌ అంచనావేసింది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: